పెద్ద నోట్లను రద్దు చేస్తూ.. కేంద్రం చేసిన ప్రకటనకు 9రోజులు పూర్తికావస్తుంది. సంచలన నిర్ఱయాలు తీసుకున్నప్పుడు.. సహజంగానే జనంలో ఆందోళన, గందరగోళం అంతా సాధారణమే అనుకున్నారు. రెండు రోజులు ఓపిక పడితే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పటికీ.. బ్యాంకుల మందు, ఏటీఎంల ముందు అదే క్యూ కనిపిస్తోంది. ఆఖరికి గంటల తరబడి క్యూ లో నిలుచున్న వ్యక్తులు ఓపిక నశించి బ్యాంకు అద్దాలు ధ్వంసం చేస్తున్న ఘటనలు కూడా ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల చోట చేసుకుంటున్నాయి. సికింద్రాబాద్ మారేడ్ పల్లి ఆంధ్రా బ్యాంకు ముందు రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మీనారాయణ క్యూలోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే సరికే చనిపోయాడు. దేశంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి.
ఓ వైపు ప్రజలు క్యూలైన్లో నిలబడి డబ్బులు డ్రా చేసుకుంటుంటే పోలీసులు ఏకంగా బ్యాంక్ లోపలకి వెళ్లి నిమిషాల్లో తమదగ్గర ఉన్న పాతనోట్లను కొత్తగా మార్చుకుని వస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన ఓ సామాన్యూడిపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఆ సామాన్యూడిని పోలీసుస్టేషన్ వరకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడపజిల్లాల్లో జరిగింది. ఇప్పటీకి అక్కడి అధికారులు స్పందించలేదు. ప్రజలను కంట్రోల్ చేయాల్సిన పోలీసులే ఇలా జనాల పై విరుచుకపడటం ఏంటి ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల సంగతి ఇలా ఉంటే బ్యాంక్ అధికారులు మాత్రం వందకు యాభై తీసుకుని పెద్దనోట్లు మార్చేస్తున్నారు. మీరు లక్షల మార్చాలన్న రెండు లక్షలు మార్చాలన్న దాంట్లో కొంత కమిషన్ ఇస్తే చాలు మీకు పని జరిగిపోతుంది. క్యూలో కూడా నిలబడటం అవసరం లేదు. మీకు బ్యాంక్ అధికారులు తెలిసినవారు అయ్యి ఉండాలి లేదా వాళ్లకు మీరు కమిషన్ ఇచ్చే వారు అయ్యి ఉండాలి. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తుంది. ఒక వ్యక్తి బ్యాంక్ కిటికి దగ్గర నిల్చోని ఉండి తనకు కావాల్సిన కొత్తనోట్లను మార్చుకుని వెళ్తాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది బ్యాంక్ అధికారులు మాత్రం తమదే రాజ్యం అన్నట్టుగా వ్యవహారిస్తున్నారు. సామాన్యూలకు చుక్కలు చూపిస్తున్నారు. డబ్బున్నోళ్లకు ఈ వీడియోలో చూపించినట్లుగా బ్యాక్‌డోర్ తెరుస్తున్నారు. దీని చూసిన జనం బ్యాంక్‌లో ఈ సౌకర్యం కూడా ఉందా అని పెదవి విరుస్తున్నారు.