సఫారీల ఆశలపై నీళ్లు చల్లిన వరణుడు..

296
sa vs wi
- Advertisement -

ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన దక్షిణాఫ్రికా ఆశలపై నీళ్లు చల్లాడు వరణుడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ వర్షార్పణం కావడంతో గెలుపు సాధించకుండానే పాయింట్ల ఖాతాను తెరిచింది. 8వ ఓవర్ జరుగుతుండగా వర్షం మొదలవడంతో ఆటను నిలిపివేశారు. ఆ తర్వాత చాలా సేపటికీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు.

టాస్ గెలిచిన బౌలింగ్‌ ఎంచుకున్న విండీస్‌ బౌలర్లు సఫారి బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు. ఆమ్లా,డికాక్,మార్క్‌రమ్ ను తన స్వింగ్‌తో కోట్రెల్‌ బోల్తా కొట్టించాడు. ఈక్రమంలో 8 ఓవర్‌లో చినుకులు మొదలవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.

దీంతో ఇరుజట్లకు తలా ఒక పాయింట్ వచ్చింది. సౌతాఫ్రికా సెమీస్ ఆశలు మరింత క్లిష్టమయ్యాయి. మిగిలిన ఐదు మ్యాచుల్లో తప్పక విజయం సాధిస్తేనే సఫారీలు సెమీస్‌ చేరే అవకాశం ఉంటుంది.

- Advertisement -