ఆక్లాండ్ మహా నగరంలోని త్రి కింగ్స్ సబర్బ్ లోని ఫికిలింగ్ కన్వెన్షన్ సెంటర్ లో అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి కొసన అధ్యక్షతన టీఆర్ఎస్ న్యూ జీలాండ్ శాఖ రాష్ట్రావతరణ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించి ప్రొఫెసర్ జయశంకర్ గారిని గుర్తు చేసుకున్నారు . కెసిఆర్ గారి పోరాట పటిమ మలిదశ ఉద్యమానికి కీలకం అని , తెలంగాణ అంటే ముందుగా గుర్తుకువచ్చే వ్యక్తి కెసిఆర్ గారు అని తెలిపారు .
టీఆర్ఎస్ న్యూ జీలాండ్ శాఖ క్రమశిక్షణ కమిటీ ఛైర్పర్సన్ అరుణ్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ట్రయిల్ రన్ సక్సెస్ అయ్యి త్వరలో సస్యశామలం కాబోతున్న తెలంగాణ గురించి వివరించారు. హోనోరారి ఛైర్పర్సన్ కళ్యాణ్ రావు కాసుగంటి కేటీఆర్ గారు అన్ని విషయాల పైన అవగాహనా కలిగివున్న మంచి నాయకుడు అని , తెలంగాణ అభివృద్ధి లో వారి పాత్ర కీలకం అని పేర్కొన్నారు .
ఉపాధ్యక్షులు జగన్ రెడ్డి , రామారావు రాచకొండ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమం కోశాధి కారి అభిలాష్ రావు యాచమనేని పర్యవేక్షణలో జరిగింది . మెంబర్షిప్ ఇంచార్జి కిరణ్ కుమార్ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు . ఉమెన్స్ అఫైర్స్ ఛైర్పర్సన్ సునీత విజయ్ వందన సమర్పణ చేశారు .
అనంతరం తెలంగాణ వంటలతో విందు ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమంలో పానుగంటి శ్రీనివాస్ నరేందర్ రెడ్డి పట్లోళ్ల , శ్రీలత మాగతాల , బాలా బీరం , జగదీశ్వర్ రెడ్డి , వర్ష రెడ్డి, ప్రతిభ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.