- Advertisement -
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్గా మాజీ ఎంపీ,సీఎం జగన్ బంధువు వైవీ సుబ్బారెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హిందువు కాదు క్రిస్టియన్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పందించారు వైవీ.
తాను వందశాతం హిందువునని, తిరుమల శ్రీవారు తనకు ఇష్టదైవమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన పేరును ఈ పదవి కోసం పరిశీలనలోకి తీసుకోగానే కొందరు గిట్టనివారు తాను క్రిస్టియన్ని అంటూ తప్పుడు ప్రచారాన్ని మొదలు పెట్టారని మండిపడ్డారు.
టీటీడీ చైర్మన్గా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తనకు అవకాశం ఇచ్చారని, దైవ సేవకు నన్ను పంపుతున్నందున తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని జగన్ కచ్చితంగా నెరవేరుస్తారని తెలిపారు.
- Advertisement -