బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ తండ్రి, ప్రముఖ స్టంట్ మాస్టర్ వీరూ దేవగణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ అజయ్ కుటుంబానికి సంతాపం తెలిపారు. అయితే ఎన్నికల హడావుడిలో ప్రధాని ఎంతో బిజీగా ఉండడంతో ఆ సమయంలో స్పందించలేకపోయారు. తాజాగా ప్రధాని మోదీ అజయ్ దేవగణ్ కుటుంబానికి ఓ లేఖ రాశారు
వీరూ దేవగణ్ ఎంతో గొప్పవారని కొనియాడారు. బాలీవుడ్‌లో సాహసోపేతమైన స్టంట్ మాస్టర్ ఎవరంటే వీరూ దేవగణ్ అనే చెప్పాలి. తన వద్ద పనిచేసే వ్యక్తులను కంటికి రెప్పలా చూసుకునే వీరూ చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డాను. సినిమాపై ఉన్న గౌరవంతో ఎన్నో నవ్యరీతులను వెండితెరకు పరిచయం చేసిన వ్యక్తి వీరూ దేవగణ్. గ్రాఫిక్స్ లేని కాలంలో ఆయన చేసిన సాహసాలు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాయి.
మనం తీసుకునే రిస్క్ స్థాయిని బట్టే మన ప్రపంచం పయనిస్తుంది. ఆ విధంగా చూస్తే వీరూ దేవగణ్ లాంటి వ్యక్తి ఎంతో అరుదుగా కనిపిస్తారు. పనిని నమ్ముకుని, దాని కోసం ఎంతకైనా తెగించేవారికి వీరూ దేవగణ్ ఓ స్ఫూర్తి ప్రదాత. ఈ సందర్భంగా