తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్‌లోని పబ్లిక్‌గార్డెన్స్‌లో రాష్ట్రావతరణ వేడుకల్లో కేసీఆర్ ఇవాళ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని, రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్లలో ఎన్నో అవరోధాలు అధిగమించామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకుని ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. ఒక రాష్ట్ర చరిత్రలో ఐదేళ్ల కాలం చిన్న కాలం. అయితే మనం సాధించిన ఫలితాల దృష్ట్యా ఈ ఐదేళ్ల కాలం ఎంతో ఘనమన్నారు. శాంతిని, సామరస్యాన్ని కాపాడుకుంటూ అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లు తెలిపారు.
దేశ చరిత్రలో ప్రత్యేక మహోద్యమాన్ని సాగించి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సఫల రాష్ట్రంగా పురోగమిస్తోంది. మొక్కవోని దీక్షతో అభ్యుదయపథంలో సాగుతోంది. ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో అవరోధాలను అధిగమించగలిగాం. అపనమ్మకా%