సూపర్‌స్టార్ మహేశ్ బాబు 26వ సినిమా ప్రారంభమైంది. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ తదుపరి చిత్రంలో నటిస్తుండగా.. ఈ మూవీకి ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా.. విజయశాంతి మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
ప్రముఖ నటుడు జగపతి బాబు విలన్ రోల్‌లో కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ , అనీల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నాడట. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకి మంచి వినోదం అందించడం ఖాయం అని చిత్ర యూనిట్ అంటుంది. లాంఛనంగా ప్రారంభమైన చిత్ర పూజా కార్యక్రమానికి రాఘవేంద్ర రావు, దిల్ రాజు, అనీల్ సుంకర, జెమిని కిరణ్ తదితరులు హాజరయ్యారు.