- Advertisement -
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి చేయాల్సింది చేస్తూనే ఉండాలని వైసీపీ అధినేత,రాష్ట్రానికి కాబోయే సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి ఆర్థిక సాయం కావాలని మోదీని కోరానని చెప్పారు. ఏపీకి‘ప్రత్యేక హోదా’ అవసరం గురించి, రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్‌పై బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయని ప్రధానికి తెలిపినట్టు చెప్పారు.
రాష్ట్రం విడిపోయే నాటికి రూ.97 వేల కోట్ల అప్పులు ఉంటే, బాబు ఐదేళ్ల పాలనలో రూ.2 లక్షల 57 వేల కోట్లకు అప్పులు చేరాయని అన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని అనుకుంటున్నట్టు చెప్పారు. ప్రధానిని ఎప్పుడు కలిసినా ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
- Advertisement -