అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో సీఎం పదవికి రాజీనామా చేశారు చంద్రబాబు. వైసీపీ ప్రభంజనంతో టీడీపీ హేమాహేమిలు ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్‌కు పంపారు చంద్రబాబు. ఆయన రాజీనామాను అమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉండాలని కోరారు.
ఇక వైసీపీ విజయం అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ గత చరిత్రను పునరావృతం చేస్తానని వెల్లడించారు. ప్రజల కష్టాలు చూశా.. విన్నా.. నేనున్నా.. అని భరోసా ఇస్తున్నా. నవరత్నాలను తెచ్చే పాలన ఇవ్వబోతున్నాం. ఈ నెల 30న విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తా అని వెల్లడించారు.
ఈ విజయం తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. గొప్ప పరిపాలన ఎలా ఉంటుందో చేసి చూపుతానని చెప్పారు. విశ్వసనీయతలేని నాయకుల పరిస్థితి ఏమిటో తమ ఓటు ద్వారా చూపించారు. మంచి సీఎం అన్పించుకొనేలా కచ్చితంగా నా ప్రతి అడుగూ వేస్తానని చెప్పారు.