జగన్ బాహుబలి..నేను దేవసేనః నటి శ్రీరెడ్డి

246
Sri Reddy Jagan
- Advertisement -

ఏపీలో జగన్ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి నుంచి వైసీపీ అభ్యర్దులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకూ వైసీపీ 150 సీట్ల ఆధిక్యంలో ఉండగా.. టీడీపీ 25 సీట్లలో ఆధిక్యంలో ఉంది. దీంతో వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వైసిపి శ్రేణులు పటాసులు కాల్చుతూ సీట్లు పంచుకుంటున్నారు. ఇక తాజాగా జగన్ విజయం పై స్పందించారు ప్రముఖ నటి శ్రీరెడ్డి.

వైసిపి గెలుపుతో సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. తన పగ తీరిందంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. నా పగని, పంతాన్ని తీర్చిన అందరికి నా సాష్టాంగ నమస్కారం. నేను రియల్ దేవసేన.. రియల్ బాహుబలి వన్ అండ్ ఓన్లీ జగన్ అన్నారు. ఈపోస్ట్ తో పాటు బాహుబలిలో అనుష్క ఫోటో పక్కన తన ఫోటో పెట్టింది. ఇక శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ కు వైసిపి శ్రేణులు మద్దుతు తెలుపుతుంటే, జనసేన, టీడీపీ కార్యకర్తలు మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు.

- Advertisement -