మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రెడ్డికి సర్వేల్లో మంచి పేరుండేది. ఆంధ్ర ఆక్టోపస్ గా ప్రజల నాడి పసిగట్టే ఆయన ఈమధ్య చేసిన సర్వేలన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఆయన చేసిన సర్వేలల్లో నిజం లేదని ఇటివలే వచ్చిన రిజల్ట్ ను చూస్తే తెలిసిపోతుంది. లగడపాటి ఎప్పుడైతే టీడీపీ పక్షాన చేరారో అప్పటినుండి అతని సర్వే లెక్కలన్నీ కూడా టీడీపీ కి అనుకూలంగా మారుతున్నాయి గత రెండు సంవత్సరాల నుండి లగడపాటి చంద్రబాబు చుట్టూ తిరగడం అతనితో మంతనాలు జరపడం వైసీపీ పైన విమర్శలు చెయ్యడం లాంటివి బాగానే చేస్తున్నారు. ఇటివలే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిన లగడపాటికి ఎదురుదెబ్బ తగిలింది.
కానీ ఫలితాలు మాత్రం అతున చెప్పిన దానికి విరుద్దంగా వచ్చాయి. లగడపాటి సర్వేను నమ్మి చాలా మంది బెట్టింగ్ లు వేసి తమ డబ్బులను పోగొట్టుకున్నారు. తాజాగా నేడు వెలువడిన ఫలితాల్లో కూడా సేమ్ రిజల్ట్ వెలువడింది. టీడీపీ అధికారం లోకి వస్తుందని వైసీపీ మళ్ళి ప్రతిపక్షంలోనే నిలబడుతుందని వ్యాఖ్యలు చేశారు, కానీ ఈరోజు ఫలితాలు చూస్తుంటే వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. ఫ్యాన్ గాలి ఎక్కువగా వీస్తుంది సైకిల్ కి పంచర్ పడింది. తాజాగా లగడపాటి సర్వే పై విజయసాయి రెడ్డి స్పందించారు. ఇంకోసారి సర్వే అనకుండా లగడపాటిని లోపలెయ్యాలి…అసలు అతను ఏవిధంగా సర్వే చేశారు..ఎవరెవరిని కలిశారు ఆ వివరాలన్ని తెలిపాలని డిమాండ్ చేశారు..లేదంటే లగడపాటిపై చీటింగ్ కేసు పెట్టి లోపల వెయ్యాలన్నారు.