కేంద్రప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకలు, పోస్టాఫీస్ ల వద్ద బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూ నిలుచుంటున్నారు. మోడీ తీసుకున్నఈ నిర్ణయంతో,,ఓ పెద్దావిడ కూడా తనవద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకు వద్దకు వచ్చింది. ఇంకే ముంది మీడియా మొత్తం ఒక్కసారిగా ఆమె వైపే కెమేరాలు తిప్పాయి. ఆమె ఎవరో కాదు భారత ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరా బెన్. మోడీ తల్లి కూడా పాత నోట్లను మార్చుకునేందుకు మంగళవారం ఉదయం గుజరాత్ లోని గాంధీనగర్ లో ఓ బ్యాంకుకు వెళ్లారు.
సహాయకుల సాయంతో మోడీ తల్లి గాంధీనగర్ లోని బ్యాంక్ కు చేరుకున్నారు. వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ వద్దకు వెళ్లి తన పాత డబ్బును మార్పిడి చేసుకున్నారు. 4500 రూ. ఎక్సైంజ్ చేసుకున్నారు. అనంతరం తను మార్చుకున్న నోట్లను మీడియాకు చూపించారు. ప్రధాన మంత్రి తల్లి అయిండి,,బ్యాంక్ వద్దకు రావడంతో,,ఒక్కసారిగా మీడియా దృష్టిని ఆకర్షించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఎవరు అతితులు కాదని తేల్చినట్టైంది. రూ..500, రూ.1000 నోట్లు ఇక చెల్లబోవని ఈ నెల(నవంబర్) 8న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యప్రజానీకం బ్యాంకుల ముందు బారులు తీరారు. నిత్యవసరాల కోసం బ్యాంకుల ముందు వేచి చూడడం తప్పడంలేదు.