ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన రిపోర్టుతో టీడీపీ గుండెళ్లో గుబులు పుడుతోంది. ఆంధ్రా ఆక్టోపస్ ఒక్క లగడపాటి మినహా మిగితా సర్వేలన్ని టీడీపీకి ఓటమి తప్పదని స్పష్టం చేస్తుండగా సీనియర్ నేతలు ఓటమి పాలవుతున్నారని వెల్లడించాయి. దీంతో వైసీపీలో ఉత్సాహం నెలకొనగా టీడీపీలో నైరాశ్యం నెలకొంది.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ గెలుస్తాడా లేదా అన్న సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో తాను పోటీచేస్తున్న మంగళగిరిని మందలగిరిగా మార్చేసి నవ్వులపాలైన లోకేశ్ ఓటమి తప్పదని తెలుస్తోంది. మంగళగిరిలో లోకేశ్ గెలుపు కష్టమేనని ఆరా సర్వే సంస్థ అంచనా వేసింది.
వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపు ఖాయమని తెలుస్తోండగా ఈ సంస్థ సర్వే ప్రకారం వైసీపీకి 100కిపైగా సీట్లు రావొచ్చట.25 ఏంపీ సీట్లలో 20కి పైగా వైసీపీ గెలుస్తుందని చెబుతుండగా లోకేశ్ గెలుపుపై ఎలాంటి భరోసాలేదని వెల్లడించింది.
దీంతో టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. వాస్తవానికి మంగళగిరి బరి నుంచి లోకేశ్ పోటీచేస్తున్నప్పుడే గెలుపుపై ధీమా తక్కువగానే ఉంది. అసలు ఈ ప్లేస్ లోకేశ్ కు సూటబుల్ ప్లేస్ కాదన్న వాదనలు వినిపించాయి. అయితే లోకేశ్ మాత్రం పట్టుబట్టి ఇక్కడి నుండి బరిలో దిగారు. అయితే ఫలితం లోకేశ్‌కి వ్యతిరేకంగా వస్తే పొలిటికల్ కెరీర్ సంక్షోభంలో పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.