ఎగ్జిట్ పోల్స్‌:హైదరాబాద్… ఓవైసీదే

347
asaduddin-owaisi
- Advertisement -

నాలుగు దశాబ్దాలుగా పాతబస్తీలో వార్‌ వన్‌ సైడే. ప్రత్యర్థి ఎవరైన గెలుపు మాత్రం ఎంఐఎందే. తాజాగా మరోసారి హిస్టరీని అసదుద్దీన్ రిపీట్ చేస్తారని స్పష్టం చేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్‌. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించాయి బీజేపీ,కాంగ్రెస్. కానీ ఎలాంటి ఫలితం లేకపోయిందని తేల్చిచెబుతున్నాయి. తండ్రి బాటలోనే విజయపరంపరను కొనసాగిస్తూ నాకు నేనే పోటీ అన్నట్లుగా దూసుకుపోతున్నారని ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడిస్తున్నాయి.

ఎంఐఎం విజయంలో పాతబస్తీ వాసులే కీలకమని ఇక్కడి ఓటు బ్యాంకును ఎంఐఎం కాపాడుకుందని వెల్లడవుతోంది. పోలింగ్ శాతం తక్కువ కావడంతో ఓవైసీ విజయంపై అనుమానాలు నెలకొన్న గెలుపు ఆయనదేనని చెబుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్ధి ఫిరోజ్ ఖాన్,బీజేపీ అభ్యర్ధి పెద్దగా ప్రభావం చూపలేకపోయాని టాక్‌.ఈ సారి గెలుపుతో వరుసగా నాలుగోసారి హైదరాబాద్‌పై పతంగిని ఎగురవేయనున్నారు ఓవైసీ.

1984 నుండి హైదరాబాద్‌ ఎంపీ స్ధానాన్ని తిరుగులేని మెజార్టీతో గెలుస్తూ వస్తోంది ఐఎంఐఎం.1984లో అసద్ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలుపొందారు. తర్వాత ఎంఐఎంను స్ధాపించిన ఓవైసీ ఐదుసార్లు హైదరాబాద్ ఎంపీగా గెలుస్తూ వచ్చారు.

ఓవైసీ రాజకీయ వారసుడిగా పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టిన అసద్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత వరుసగా మూడు సార్లు 2004 ,2009, 2014 ఎన్నికల్లో హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అసదుద్దీన్‌ ఓవైసీ పోటీ చేసి గెలుపొందారు.

- Advertisement -