టీవీ9 వివాదం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో శివాజి ఎట్టకేలకు అజ్నాతం వీడారు. ఇవాళ ఆయన ఓ విడియో విడుదల చేశారు. . ఈసందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పలు న్యూస్ ఛానల్లు, సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. శివాజి పారిపోయాడు అని కొంత మంది నాపై దృష్ట్రచారం చేస్తున్నారని చెప్పాడు. తాను ఎక్కడికి పారిపోలేదన్నారు. ఇదోక చిన్న కేసు అని దాని గురించి తాను భయపడి పారిపోవాల్సిన అవసరం లేదన్నారు.
ఆరోగ్యం బాలేక పోవడం వల్లే తాను బయటకు రాలేకపోతున్నానని తెలిపాడు. మరో నాలుగు రోజుల వరకూ తాను బయటకు రాలేనని చెప్పారు. 2018లో టీవీ9 షేర్లకు సంబంధించి 2018లోనే అగ్రిమెంట్ జరిగిందని అందుకు ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. కౌశిక్ అనే వ్యక్తి ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే తన ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహిస్తారా అని ఫైర్ అయ్యారు. చిన్న విషయాన్ని కొన్ని మీడియా సంస్ధలు పెద్దదిగా చేశాయన్నారు. కొంతమంది వ్యక్తులు కావాలనే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. నాకు రవిప్రకాశ్ గారికి సంబంధించిన కేసు..ఇది కోర్టులో ఉంది. దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేనని చెప్పారు.