“సైరా” విడుదల తేదీ ఖారారు..

227
syera
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈచిత్రానికి దర్శకత్వం వహించగా..కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో జరుగుతుంది. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈచిత్రం ఎపుడు విడుదలవుతుందన్న దానిపై మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈమూవీని ఆగస్ట్ 15 విడుదల చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్ 2న ఈమూవీని విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. గాంధీ జయంతి రోజున విడుదల చేస్తే సినిమాకు ప్లస్ గా మారుతందని భావిస్తున్నారు చిత్రయూనిట్. త్వరలోనే ఈమూవీ విడుదలపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమచారం.

- Advertisement -