హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ  సదస్సు …

397
wdo
- Advertisement -

హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికకానుంది.అక్టోబర్ 11, 12 తేదీల్లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ (డబ్య్లూడీఏ) 31వ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నట్లు ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. హ్యూమనైజింగ్ డిజైన్ ప్రధాన అంశంగా ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ డిజైన్ ఫోరం ఈ సమావేశాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని ఆయ‌న చెప్పారు.

అక్టోబర్ 11,12 తేదీల్లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సదస్సు రెండు రోజుల పాటు జరగనుందని ట్వీట్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వెల్ కమ్ టూ హైదరాబాద్,ఇండియా అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించి వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ రూపొందించిన వీడియోని షేర్ చేశారు.వివిధ దేశాలకు చెందిన డ్యబ్లూడీవో మెంబర్లు పెద్ద సంఖ్యలో ఈ ఈవెంట్‌కు హాజరుకానున్నారు. డిజైనింగ్ రంగంలో అనుభజ్ఞులైన వారు తమ అనుభవాలను ఈ వేదిక ద్వారా వివరించనున్నారు.

గ్లోబల్ సిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్‌ డిజైనింగ్ సదస్సుకు వేదిక ఆనందంగా ఉందన్నారు సంస్థ అధ్యక్షుడు లుయిసా బొచ్చిట్టో. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు.

ktr twitter

- Advertisement -