చంద్రబాబుకు షాక్.. కేసీఆర్ జగన్ లకు సోనియా లేఖ

343
Sonia gandhi
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23 రానుండటంతో దేశ వ్యాప్తంగా ఉత్కంఠకు తెరలేపుతుంది. సొంతంగా కేంద్రంలో అధికారంలోకి రావడానికి అటు బీజేపీకిగానీ, ఇటు కాంగ్రెస్ కు గానీ మెజార్టీ సీట్లు లేవు. కాబట్టి ప్రాంతియ పార్టీల మద్దతు కోసం ఆ రెండు పార్టీలు క్యూ కడుతున్నాయి. ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా అటు బీజేపీ గానీ, ఇటు కాంగ్రెస్ గానీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్ధితి లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటిని ఏకధాటిపైకి తీసుకువస్తున్నారు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ.

తాజాగా మే23 భేటీ అయ్యేందుకు రావాలంటూ వైసిపి అధినేత జగన్, టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ రాశారు సోనియా. ఇక వారిద్దరికి లేఖ రాయడంతో టీడీపీ వర్గాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. చంద్రబాబు ఓపెన్ గా కాంగ్రెస్ కు మద్దతుఇస్తున్నా ఆయనకు లేఖ రాయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇక కేసీఆర్ జగన్ మాత్రం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాతే తమ నిర్ణయం చెబుతామన్నట్లుగా తెలుస్తుంది.

కేసీఆర్ ఎటు వెళితే జగన్ కూడా అటువైపే అడుగులు వేయనున్నట్లు తెలుస్తుంది. ఒక వేళ కేసీఆర్, జగన్ కనుక కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే కేంద్రంలో ఈ ఇద్దరూ క్రీయా శీలక పాత్ర పోషించనున్నారు. అప్పుడు చంద్రబాబు పని అయిపోయినట్లే అనుకోవచ్చు.. కాంగ్రెస్ అధిష్టానం కూడా చంద్రబాబు ను పక్కన పెట్టేయవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుందన్న విషయం మే 23 తెలియనుంది.

- Advertisement -