గోవాలో ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ స్టెప్పులు…

356
Ismart Shankar
- Advertisement -

ఎన‌ర్జ‌టిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. `డ‌బుల్ దిమాక్ హైద‌రాబాదీ` ట్యాగ్ టైన్‌. రీసెంట్‌గా టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పాటల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. అందులో భాగంగా గోవాలో రామ్ న‌భా న‌టేశ్‌ల‌పై ఓ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. భాను మాస్ట‌ర్ నృత్య రీతుల‌ను స‌మ‌కూరుస్తున్నారు. రామ్ జోడిగా నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేశ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

Ismart Shankar

హీరో రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను రేపు విడుద‌ల చేస్తున్నారు. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. పూరిజ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి క‌నెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -