టెన్త్ ఫలితాలు విడుదల..జగిత్యాల జిల్లా ఫస్ట్..హైదరాబాద్ లాస్ట్

247
ssc Results
- Advertisement -

తెలంగాణలో పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి. రెగ్యూలర్ విద్యార్ధుల ఉత్తీర్ణత శాతం 94.3 వచ్చినట్టు తెలిపారు. ప్రతిసారి లాగే ఈసారి కూడా టెన్త్ ఫలితాల్లో బాలకలే పై చేయి సాధించారు. 4120 జిల్లా పరిషత్ స్కూళ్లలో లక్షా 76వేల 830మంది విద్యార్దులు హాజరుకాగా అందులో 91శాతం మంది ఉత్తిర్ణులయ్యారు. తెలుగు మీడియంలో 86.56శాతం విద్యార్దులు పాస్ కాగా..94.30శాతం మంది విద్యార్దులు పాసయ్యారు. అలాగే ఉర్దూ మీడియంలో 94.63శాతం పాసయ్యారు. ఓవరాల్ గా బాలుర ఉత్తీర్ణత శాతం 91.18..బాలకలు 93.45శాతం ఉత్తీర్ణత సాధించారు.

జిల్లాల వారీగా ఉత్తిర్ణత శాతం చూసుకున్నట్లయితే జగిగ్యాల జిల్లా 99.73శాతంతో ప్రధమ స్ధానంలో ఉంది. 99.33శాతంతో సిద్దిపేట రెండవ స్ధానంలో ఉంది. కరీంనగర్ 98.38శాతంతో మూడవ స్ధానంలో ఉంది. సంగారెడ్డి 98.20శాతంతో నాల్గవ స్ధానంలో ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా 97.75 శాతంతో 5 వస్ధానంలో ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 96.65 శాతంతో 6వ స్ధానంలో ఉంది. ఇక టెన్త్ ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా చివరి స్ధానంలో ఉంది.

- Advertisement -