నేడే ఐపీఎల్‌-12 ఫైనల్‌..

250
- Advertisement -

అడుగడుగునా ఉత్కంఠ రేకెత్తించిన ఐపీఎల్‌ 12వ సీజన్‌ చివరి దశకు చేరుకుంది. ధోని సారథ్యంలోని చెన్నై.. రోహిత్‌ నాయకత్వంలోని ముంబయిల మధ్య నేడే తుది పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరుగనుంది. మెగా ఫైనల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై, మాజీ విజేత ముంబయి తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమయ్యే ఐపీఎల్‌ తుది మ్యాచ్‌ను వీక్షించేందుకు వేలాది మంది తరలిరానున్నారు.

జట్లు (అంచనా)
చెన్నై : వాట్సన్, డుప్లెసిస్, రైనా, రాయుడు, విజయ్, ధోనీ, జడేజా, బ్రేవో, హర్భజన్, తాహిర్, చహర్.

ముంబై: రోహిత్, డికాక్, సూర్యకుమార్, కిషన్, హార్దిక్, పొలార్డ్, కృనాల్, రాహుల్ చహర్, బుమ్రా, మలింగ, జయంత్/కటింగ్.

 MI vs CSK Final

- Advertisement -