స్టార్ హీరోలు…25వ సినిమా హిట్టా…. ఫట్టా…!

393
tollywood
- Advertisement -

సినిమా..సినిమా..సినిమా..అది ఓ రంగుల ప్రపంచం..ఈ రంగుల ప్రపంచంలో వెండితెరపై వెలిగిపోవాలని ఎందరికో కల. ఆ కలను సాకారం చేసుకోవటానికి పడరాని పాట్లు పడుతుంటారు. దాని కోసం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుంటు.. అవకాశాల కోసం పడిగాపులు పడుతుంటారు. అలా అందివచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకొని వెండితెరపై తిరుగులేని రారాజులుగా ఎదిగిన వారెందరో. తమ నటన,సామాజిక సేవతో ఎల్లలు లేని అభిమానాన్ని సంపాదించుకున్న ఎందరో హీరోలు..వందల చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే వారి కెరీర్‌లో కీలకంగా మారిన 25వ సినిమా హిట్టా..ఫట్టా ఓ సారి పరిశీలిద్దాం.

నందమూరి తారకరామారావు 1954లో ఇద్దరు పెళ్లాలు సినిమాతో 25వ మూవీ క్లబ్లో అడుగుపెట్టారు. ఎఫ్ నగూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందింది. 1953లో బ్రతుకు దెరువు సినిమాతో అక్కినేని నాగేశ్వరావు ప్రేక్షకుల ముందుకువచ్చారు. ఏఎన్నార్ 25వ సినిమా వచ్చిన ఈ మూవీకి రామకృష్ణారావు దర్శకత్వం వహించారు.

()ఘట్టమనేని కృష్ణ -బొమ్మలు చెప్పిన కథ (1969)లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

()మెగాస్టార్ చిరంజీవి -న్యాయం కావాలి.. 1981లో విడుదలైన ఈ చిత్రం 100 రోజులు ఆడింది. 5లక్షల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కగా చిరంజీవి రూ. 10 వేల రెమ్యునరేషన్ తీసుకున్నారు.

()బాలకృష్ణ- నిప్పులాంటి మనిషి.. 1986లో ఈ సినిమా విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద యావరేజ్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.

()నాగార్జున- జైత్రయాత్ర.. 1991లో సినిమా విడుదల కాగా తనికెళ్ల భరణి కథ అందించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

()వెంకటేష్ -కొండపల్లి రాజా.. 1993లో విడుదలైంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో పాటు వెంకీ కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది.

()పవన్ కల్యాణ్- అజ్ఞాతవాసి.. 2018లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టినా వసూళ్లలో పర్వాలేదనిపించింది.

()రవితేజ- కిక్… 2009 అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

()మహేష్ బాబు- మహర్షి ..2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ తో దూసుకుపోతోంది.

()జూనియర్ ఎన్టీఆర్- నాన్నకు ప్రేమతో… టాలీవుడ్‌ సక్సెస్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో వందకోట్ల క్లబ్లో అడుగుపెట్టాడు ఎన్టీఆర్.ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ నంది,ఎన్టీఆర్ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.

()గోపిచంద్- పంతం.. 2018లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది

()నితిన్ చల్ 0మోహన రంగ 2018లో విడుదల కాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

- Advertisement -