నీరవ్‌కు మరోసారి చుక్కెదురు…

305
nirav modi
- Advertisement -

ఆర్థిక నేరగాడు,వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి మరోసారి చుక్కెదురైంది. పంజాబ్ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)ని 13 వేల కోట్ల మోసం చేసిన మోడీ లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లండన్ పోలీసులు నీరవ్‌ని అరెస్ట్ చేశారు. అప్పటినుండి బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న మోడీ బెయిల్ పిటిషన్‌ను మరోసారి తిర్కసరించింది న్యాయస్ధానం.

ప్రస్తుత పరిస్థితుల్లో నీరవ్‌కు బెయిల్‌ మంజూరుచేస్తే ఆయన విచారణకు హాజరుకాకపోవచ్చని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే లండన్ శివార్లలో ఉన్న వాండ్స్‌వర్త్ జైలులో పరిస్థితులు మనుషులు జీవించేలా లేవని బెయిల్ కోసం ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తామని నీరవ్ తరపు న్యాయవాది వాదించిన జడ్జి వినలేదు. ఇది సాధారణ కేసు కాదనీ, నీరవ్‌ గతంలోనే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు బెదిరించేందుకు ప్రయత్నించారని భారత న్యాయవాది నిక్‌ హెర్న్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నీరవ్‌ బెయిల్‌ను తిరస్కరించిన న్యాయస్ధానం తదుపరి విచారణను మే 30కి వాయిదా వేసింది.

భారత్‌ నుండి పారిపోయిన రెండు సంవత్సరాల తర్వాత లండన్‌ వీధుల్లో నీరవ్ ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఈ విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో వెస్ట్ మిన్‌స్టర్ కోర్టు అతడికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

నీరవ్ మోడీ భారత బ్యాంకులకు రూ.13వేల 700 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డాడు.2018 జులైలో నీరవ్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు నీరవ్‌కు చెందిన ఫాం హౌజ్‌,సోలార్ పవర్ ప్లాంట్,అహ్మద్ నగర్లో ఉన్న 135 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు లండన్‌లో కూడా నీరవ్ వజ్రా వ్యాపారం చేస్తుండటం విశేషం.

- Advertisement -