సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ మహర్షి. మహేశ్ సరసన పూజా హెగ్డె హరోయిన్ గా నటించగా… అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. ఈమూవీని మే9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈసందర్భంగా ఈసినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు చిత్రయూనిట్. ఈసందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు మహేశ్ బాబు. తన ఏఎంబీ సినిమాస్ లో తనకు టికెట్ దొరకడం లేదని హస్యాంగా చెప్పారు.
ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఏఎంబీ సినిమాస్ లో ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ సినిమాను చూశారన్న సంగతి తెలిసిందే. ‘మహర్షి’ ప్రమోషన్ లో భాగంగా మహేశ్ బాబు, మీడియాతో మాట్లాడగా, జగన్ సినిమా చూశారన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. మీరు అవెంజర్స్ చూశారా? అన్న మీడియా ప్రశ్నకు, చాలా మంది సెలబ్రిటీలు ఏఎంబీకి వచ్చి సినిమాలు చూస్తున్నారని, తాను చూద్దామని టికెట్లు అడిగితే లేవని చెబుతున్నారని సరదాగా అన్నారు. మరో రెండు రోజుల్లోనే అవెంజర్స్ సినిమా చూస్తానని చెప్పారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మహర్షి విడుదల పై భారీ అంచనాలున్నాయి.