హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది చార్మినార్. నిత్యం దేశ, విదేశీ పర్యాటకులతో చార్మినార్ పర్యాటక క్షేత్రంగా పేరొచ్చింది.క్రీ.శ. 1591లో మహ్మద్ కులీ కుతుబ్‌షా దీన్ని నిర్మించగా కాలుష్యం కారణంగా చార్మినార్‌లోని చిన్నభాగం కూలింది. దీంతో పెను ముప్పు తప్పింది.
కాలుష్యం కారుణంగా చార్మినార్ రంగు వెలిసిపోవడంతో పురావస్తు శాఖ మరమ్మత్తులు చేపట్టింది. గత సంవత్సర కాలంగా మినార్లను శుభ్రం చేయించి రంగులు వేయిస్తోంది. అయితే అకాల వర్షాలతో చార్మినార్ నుండి సున్నపురాయి కట్టడం ఊడిపడిపోయింది. రాత్రి వేళ జరగడంతో ఆ సమయంలో పర్యాటకులు ఎవరు లేకపోవడంతో పెను ముప్పు తప్పింది.
వెంటనే స్పందించిన పోలీసులు, పురావస్తు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మినార్ నుంచి కిందపడిన భాగాన్ని సేకరించి భద్రపరిచారు. ప్రస్తుతం మరమ్మత్తు పనులను వేగవంతం చేశారు.
Telangana: A portion of one of the pillars of the historic monument Charminar in Hyderabad, got damaged yesterday. No injuries reported. pic.twitter.com/ugzX8GDBdZ
— ANI (@ANI) May 2, 2019