600 మంది అమ్మాయిలు…హాజీపూర్ కిరాతకుడి అఘాయిత్యాలు..!

298
hazipur srinivas teddy

హాజీపూర్ మానవ మృగంతో వణికిపోయింది హాజీపూర్. తమ మధ్యే తిరుగుతు ముగ్గురు అమ్మాయిలను పొట్టనపెట్టుకున్న కిరాతకుడి అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చూడటానికి అమాయకుడిగా తమ మధ్యే తిరిగిన యువకుడు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు హాజీపూర్ వాసులు.

ఒళ్లంతా కామాన్ని నింపుకున్న ఈ కీచకుడు సోషల్ మీడియాలోను అమ్మాయిలే టార్గెట్‌గా పావులు కదిపాడు. శ్రీనివాస్ రెడ్డి ఫేస్ బుక్ అకౌంట్‌ని పరిశీలించిన పోలీసులు నివ్వెర పోయారు. శ్రీనివాస్‌ రెడ్డి ఫేస్‌ బుక్‌లో 631 మంది ఫ్రెండ్స్‌ ఉంటే వారిలో 600 మందికి పైగా అమ్మాయిలే ఉన్నారు.

అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతూ వారితో స్నేహం చేసే ప్రయత్నం చేసేవాడని తేలింది. ఒకవేళ ఎవరైన కాస్త చనువుగా ఉంటే వారిని వంచించే ప్రయత్నం చేసేవాడని పోలీసులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పరిచయంతో ఇంకెవరినైనా ఏమైనా చేసి ఉంటాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. లిఫ్ట్ మెకానిక్ గా పనిచేసే శ్రీనివాస్‌ రెడ్డి గతంలో కర్నూల్‌లో ఓ యువతిని హత్య చేసి పీపాలో కుక్కాడు. ఈ నేపథ్యంలో వేములవాడ, నిజామాబాద్, కరీంనగర్, తదితర ప్రాంతాల్లో అదృశ్యమైన యువతుల వివరాలపై ఆరా తీస్తున్నారు. మొత్తంగా శ్రీనివాస్ రెడ్డి ఉదంతంతో యాదాద్రి భువనగిరి జిల్లా ఉలిక్కిపడింది.