పెను తపానుగా మారిన ఫొని..

290
fani cyclone
- Advertisement -

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను తీవ్ర రూపం దాల్చుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. గంటలకు 23 కిమీల వేగంతో దూసుకువస్తోంది. మరో 12 గంటల్లో పెను తుపానుగా మారనుండటంతో మే 3 మధ్యాహ్నానికి ఒడిశా తీరానికి చేరనుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

పెను తపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను ప్రభావితమయ్యే ప్రాంతాల్లో చర్యలు తీసుకొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు. తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరోవైపు తుపాను ప్రమాదం పొంచి ఉన్న ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలకు రూ. 1086కోట్ల నిధులను ఎన్డీఆర్‌ఎఫ్‌ విడుదల చేసింది. ఏపీకి రూ.200.25కోట్లు, ఒడిశాకు రూ.340.87కోట్లు, తమిళనాడుకు రూ. 309.37కోట్లు, పశ్చిమబెంగాల్‌కు రూ. 233.50కోట్లు కేటాయించారు.

- Advertisement -