- Advertisement -
ప్రముఖ కార్ల కంపెనీ టొయోట భారత మార్కెట్లోకి కొత్త మోడల్‌ని ప్రవేశపెట్టింది. సరికొత్త ఫీచర్స్‌తో ఆల్ న్యూ ఫార్చునర్‌ని హైదరాబాద్‌లో లాంఛ్ చేసింది. ఈ సరికొత్త మోడల్ కారుని టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించారు. కొత్త వెహికిల్ ఇంటిరియర్ బాగుందని వారు తెలిపారు. గతంలో విడుదల చేసిన మోడల్ కంటే ఇందులో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయన్నారు.
కొత్త మోడల్ కారుకి మంచి స్పందన వస్తోందని….ఇప్పటికే 100కి పైగా అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్లు షోరూం నిర్వాహకులు తెలిపారు.2009లో విడుదల చేసిన టొయోట ఫార్చునర్ కారుకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉండగా…కొత్తగా ప్రవేశపెట్టిన ఫార్చునర్‌లో 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయని తెలిపారు. కొండాపూర్‌లోని హర్ష టొయోట షోరూంలో ఈ కార్యక్రమం జరిగింది.
- Advertisement -