గౌరవం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో అల్లు శిరీష్. సంవత్సరానికో సినిమా చేస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను చురగొంటున్న శిరీష్ తమిళ స్టార్ హీరో సూర్య,మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మల్టీస్టారర్ 1971లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు శిరీష్ నటనను ప్రశంసిస్తూ కేరళలో ప్రత్యేక అవార్డు దక్కించుకున్నారు.
అల్లు శిరీష్‌కు క్రాస్‌ఓవర్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ఫర్ లులూ ఫ్యాషన్ వీక్ 2019 అవార్డు దక్కింది. కోచిలో జరిగిన అవార్డుల వేడుకల్లో ఈ అవార్డును శిరీష్‌కు అందజేశారు. టాలీవుడ్ హీరో ఈ అవార్డును అందుకోవడం ఇదే తొలిసారి. ఈ అవార్డు అల్లు శిరీష్ అందుకోవడంపై సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు.
మలయాళంలో సూపర్‌హిట్ సాధించిన చిత్రాన్ని తెలుగులో మధుర శ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా మెగాబ్రదర్ నాగబాబు అల్లు శిరీష్‌కు తండ్రి పాత్రలో నటిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇదిలా ఉండగా, అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ చూరగొంటున్నాయి.