“ఆర్ఆర్ఆర్” లో ఎన్టీఆర్ కు హీరోయిన్ ఎవరో తెలుసా?

186
Nithya menon ntr

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కథానాయకులుగా రాజమౌళి భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు రాజమౌళి బాహుబలి తర్వాత తీస్తున్న సినిమా కావడంతో ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈచిత్రం. తాజాగా రెండవ షెడ్యూల్ ను కూడా ప్రారంభించారు.

ఈసినిమాలో చరణ్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ను, ఎన్టీఆర్ కు జోడిగా హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేశారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది డైసీ ఎడ్గర్ జోన్స్.. అయితే ఆమె స్ధానంలో వెరే హీరోయిన్ కోసం వెతుకుతున్నారు దర్శకుడు రాజమౌళి.

తాజాగా ఉన్న సమాచారం ప్రకారం నిత్యామీనన్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. నిత్యాను ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా తీసుకున్నారా లేదా మూవీలో ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికి నిత్యా మీనన్ రాజమౌళి మూవీ ఛాన్స్ కోట్టేసిందని చెప్పుకోవాలి. ఒక వేళ నిత్యా మీనన్ ను వేరే పాత్రకు తీసుకుంటే హీరోయిన్ గా మరోకరికి అవకాశం రానుంది. చూడాలి మరి ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం ఎవరికి దక్కుతుందో..