ఆ ముసలవ్వకు అండగా నిలిచిన కేటీఆర్‌..

283
KTR
- Advertisement -

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ముసలవ్వ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా మొరపెట్టుకుంది. తన భూమికి పాస్ బుక్ ఇవ్వకుండా అధికారులు 2 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నారని మల్లేపల్లి నర్సమ్మ(70) ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వీఆర్వో, ఎమ్మార్వోలు రూ.లక్ష లంచం ఇస్తేనే పాస్ బుక్ ఇస్తామని వేధిస్తున్నారని వాపోయారు. తమది మాదిగ కులం అని ఆఫీసు ముందుకు కూడా రానివ్వడం లేదనీ, న్యాయం చేయాలని కోరారు. మీరు ఆదుకోకుంటే ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని కన్నీరు పెట్టుకున్నారు.

వెంటనే కేటీఆర్‌ స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు కేటీఆర్ రీట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆమెకు సంబంధించిన పాస్‌పుస్తకాన్ని అందజేశారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రానికిచెందిన మల్లేపల్లి నర్సమ్మ (70)కు అదే గ్రామంలో కొంత భూమి ఉన్నది. ఆ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలని రెండేండ్లుగా అధికారులను కోరుతున్నా ఫలితం దక్కలేదు. దీంతో ఆమె కుమారుడు ఈ విషయాన్ని కేటీఆర్‌కు ట్విట్టర్‌లో పోస్టుచేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించేలాచేసిన కేటీఆర్‌కు, జిల్లా కలెక్టర్‌కు నర్సమ్మ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

KTR

- Advertisement -