ఆంధ్రప్రదేశ్ నువ్వా నేనా అన్నట్లుగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. టీడీపీ, వైసిపి లు అధికారం తమదంటే తమదని చెప్పుకోస్తున్నాయి. అయితే, ఫలితాలు తెలియాలంటే మాత్రం మే 23వ తేదీ వరకు వేచిఉండాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మాత్రం విజయం సాధించేది తామేనని ఘంటాపథంగా చెబుతున్నారు.
మే 23తర్వాత ఏపీ సిఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నాడంటూ ఘంటాపథంగా చెప్పుకొస్తున్నారు వైసీపీ శ్రేణులు. వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ కూడా.. జగనే సీఎం.. ఏపీకి బెస్ట్ సీఎంగా పనిచేయాలంటూ అభినందనలు తెలిపారు.
ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పడు మరో అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం ఆ పార్టీ నేతలు ఏకంగా సీఎం నేమ్ ప్లేట్ సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి’ అంటూ తెలుగు, ఇంగ్లీష్‌లో రాసిన నేమ్ బోర్డు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇక దీనిపై టీడీపీ, వైసీపీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.