బ్యూటీ కాంటెస్టుల్లో గెలిచిన భామలు హీరోయిన్లుగా సినిమాల్లో ఎంపిక కావడం గతంలో చాలాసార్లు చూశాం. సుస్మితా సేన్, ఐశ్వర్యా రాయ్, ప్రియంకా చోప్రా వంటి తారలు ముందు అందాల పోటీల్లో పాల్గొని, లైమ్‌లైట్‌లోకి వచ్చారు. అక్కడ్నుంచి సినిమాల్లోకి వచ్చారు. లేటెస్ట్గా జో శర్మ (జ్యోత్స్న) ఈ లిస్ట్‌లో జాయిన్ కాబోతున్నారు.
కాలిఫోర్నియాలో జరిగిన యూఎస్ఏ ఇంటర్నేషనల్ బ్యూటీ అండ్ టాలెంట్ కాంటెస్ట్ 2019 విజేతగా తెలుగమ్మాయైన జో శర్మ (జ్యోత్స్న) నిలిచారు. 15 దేశాలకు చెందిన 15 మంది ఈ పోటీలో పాల్గొన్నారు. అందం, ప్రతిభ, నృత్యం, ఉమెన్ ఎంపవర్మెంట్ స్పీచులు.. ఇలా అన్నింటి ఆధారంగా విజేతను నిర్ణయించారు. అన్నింటిలోనూ జో శర్మ తన ప్రతిభ కనబర్చి, ‘మిస్ యూఎస్ఏ’ టైటిల్ గెలిచారు.
త్వరలో ఆమె టాలీవుడ్‌కి పరిచయం కానున్నారు. ప్రస్తుతం ‘లవ్ 2020’ చిత్రాన్ని రూపొందిస్తున్న నిర్మాత మోహన్ వడ్లపాటి త్వరలో రూపొందించబోయే మరో చిత్రం ద్వారా జో శర్మను హీరోయిన్గా పరిచయం చేయనున్నారు. అమెరికాలో అందాల పోటీల్లో మెరిసిన జో శర్మ (జ్యోత్స్న) కథానాయికగా త్వరలోనే ఓ చిత్రం చేయబోతున్నట్టు నిర్మాత మోహన్ వడ్లపట్ల తెలిపారు. మరొక తెలుగమ్మాయి వెండితెరపై మెరవబోతోందనమాట..!