‘జెర్సీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా వెంకటేశ్

271
jersey venkatesh
- Advertisement -

న్యాచురల్ స్టార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జెర్సీ.. ఈచిత్రానికి మళ్లీ రావా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా..సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. జెర్సీలో నాని సరసన శ్రధ్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా ఈనెల 19వ తేదిన ఈసినిమాను విడుదల చేయనున్నారు. ఇటివలే విడుదలైన ఈచిత్రం టీజర్, ట్రైలర్ తో అందరిని ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈసినిమాపై భారీ అంచానాలున్నాయి. ఈనెల 15వ తేదిన హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపనున్నారు.

ఈ వేడుకకి ముఖ్యఅతిథిగా వెంకటేశ్ రానున్నట్టుగా అధికారికంగా ప్రకటిస్తూ .. స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. వెంకటేశ్ రాకతో ఈసినిమాకు మరింత హైప్ రానుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఈమూవీ తర్వాత నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు.

- Advertisement -