ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈసినిమాలో హీరోయిన్లుగా ఆలియా భట్ , హాలీవుడ్ నటి డైజీని ఎంపిక చేశారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల హాలీవుడ్ హీరోయిన్ డైజీ ఈమూవీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు చిత్రయూనిట్. అయితే ఆమె స్ధానంలో ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తున్నారట చిత్రయూనిట్. ఆమె స్ధానంలో బాలీవుడ్ హీరోయిన్స్ పరిణితి చోప్రా, బాన్వీ కపూర్ ల పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం.
తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ మూవీలో నిత్యామీనన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. డైజీ స్ధానంలో నిత్యాను తీసుకున్నారా లేదా వేరే పాత్ర కోసం ఆమెను తీసుకున్నారా తెలియాల్సి ఉంది. ఈసినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్‌గా తారక్ కనిపించనున్న సంగతి తెలిసిందే.
చెర్రీకి జోడీగా బాలీవుడ్ నటి ఆలియాభట్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.