కేజీఎఫ్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. గత సంవత్సరం డిసెంబర్లో పెద్దగా హడావుడి లేకుండా విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది కేజీఎఫ్. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. యువ నటుడు యష్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. తెలుగు, హిందీ, కన్నడ భాషలలో విడుదలైన ఈ చిత్రం రీసెంట్గా వంద రోజులు పూర్తి చేసుకుంది.
అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయడానికి స్టార్ హీరోలు ఎంతో ఇంట్రెస్ట్ చూసిస్తున్నారు. ఈ నేపథ్యంలో బడా నిర్మాతలు సైతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తమ బ్యానర్లో ఒక సినిమా చేయాలని ట్రై చేస్తున్నారట. ముఖ్యంగా యూవీ క్రియేషన్స్ వారు హీరో ప్రభాస్తతో .. దిల్ రాజు బ్యానర్లో హీరోగా మహేశ్ బాబుతో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరి ప్రశాంత్ నీల్ దర్శకుడిగా ఈ రెండు ప్రాజెక్టులలో ఎప్పుడు మొలుపెడుతారో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ సాహోతో,మహేష్ మహర్షీతో బిజీగా ఉన్నారు.