ఇన్‌స్టాగ్రామ్‌ లో దుమ్ముదులుపుతున్న ప్రభాస్

323
Prabhas
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అయితే ఆయన ఇన్ని రోజులు ఓన్లి ఫేస్ బుక్ లో మాత్రమే అభిమానులకు టచ్ లో ఉండేవాడు ప్రభాస్. అయితే ప్రభాస్ తాజాగా అభిమానుల కోరిక మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ను ప్రారంభించారు. అయితే తన ఖాతాలో ఇంకా ప్రొఫైల్‌ ఫొటో కానీ, వివరాలు కానీ పోస్ట్‌ చేయలేదు.

అధికారికంగా ప్రకటించకపోయినా, ఆయన ఖాతాకు ఏడు లక్షలకు చేరువలో ఫాలోవర్లు ఉండటం గమనార్హం. ఇంతవరకూ ఆయన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఏ పొస్ట్ పెట్టలేదు. ఆయన పేరుతో ఉన్న ఫోటోతోనే ఇంత మంది ఫాలో అవుతున్నారంటే ఇంకా అతను రెగ్యూలర్ గా వాడితే ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారో అర్ధం చేసుకోవాలి.

prabhas

ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈచిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించగా..యూవీ క్రియేషన్స్ సంస్ధ నిర్మిస్తుంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రధ్దా కపూర్ నటిస్తుంది. భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదల చేయనున్నారు.

- Advertisement -