ఓటేసిన బాలయ్య,మోహన్ బాబు

434
balakrishna mohan babu
- Advertisement -

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సాధారణ ఓటర్లతో పాటు సినీ,రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆయన సతీమణి వసుంధరతో కలిసి ఓటు వేశారు.

manchu vishnu

తిరుపతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. మంచు విష్ణుతో కలిసి ఓటేసిన మోహన్ బాబు ప్రతి ఒక్కరు ఓటేయాలని పిలుపునిచ్చారు. తాను ఓటేసాను మీ సంగతేంటి అంటూ సోషల్ మీడియాలో ఓటేసిన ఫోటోను షేర్ చేశారు దర్శకుడు సురేందర్ రెడ్డి.

mohan babu

ఇక ఇప్పటికే సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్,పవన్ కల్యాణ్,అల్లు అర్జున్,రాజమౌళి,సుధీర్ బాబు,కీరవాణి,పరుచూరి బ్రదర్స్,పోసాని కృష్ణమురళి, జూనియర్‌ ఎన్టీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

balakrishna

- Advertisement -