ఓటేసిన సీఎం కేసీఆర్,కేటీఆర్

612
kcr ktr vote
- Advertisement -

సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని స్వగ్రామం చింతకమడకలో ఓటేశారు సీఎం కేసీఆర్. ప్రత్యేక హెలికాప్టర్‌లో చింతమడక చేరుకున్న సీఎం కేసీఆర్ సతీమణి శోభతో కలిసి ఓటేశారు.సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ ఓటేయడం ఇది తొలిసారి,

కేసీఆర్ రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేయగా, ఇతర ఓటర్లకు ఇబ్బంది కలగకుండ తన ఓటును వేసేసి వెళ్లిపోయారు. ఓటేసేందుకు వచ్చిన కేసీఆర్ కు హరీశ్ రావు స్వాగతం పలికారు.

ktr

బంజారాహిల్స్ లోని నంది నగర్ జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.భార్య శైలిమతో కలిసి క్యూలైన్‌లో నిల్చుని ఓటేసిన కేటీఆర్ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

ktr shalima

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం 9 గంటలకు 10.6 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గాల వారీగా హైదరాబాద్‌లో 6.34 శాతం, సికింద్రాబాద్‌లో 4.52 శాతం, మల్కాజ్‌గిరిలో 6.71 శాతం, చేవెళ్లలో 8.9 శాతం, మెదక్‌లో 13 శాతం, జహీరాబాద్‌లో 13.82 శాతం, మహబూబ్‌నగర్‌లో 15శాతం, నాగర్‌కర్నూల్‌లో 9.76 శాతం, నిజామాబాద్‌లో 3.6 శాతం, కరీంనగర్‌లో 7.8 శాతం, పెద్దపల్లిలో 14 శాతం, ఆదిలాబాద్‌లో 12.95 శాతం, నల్లగొండలో 11.56 శాతం, భువనగిరిలో 13 శాతం, ఖమ్మంలో 8.2 శాతం నమోదైంది.

- Advertisement -