పెద్ద నోట్ల రద్దుకు ముందు ఏం జరిగిందో తెలుసా..!

209
‘Don’t bring your phones’: Modi’s cabinet meet that took everyone by surprise
‘Don’t bring your phones’: Modi’s cabinet meet that took everyone by surprise
- Advertisement -

నవంబర్ 8 – మంగళవారం రాత్రి… ఈ రోజును భారతీయులు ఎవ్వరూ మరచిపోలేరు! ఎందుకంటే చెలామణిలో ఉన్న రూ. 500 – రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి మోడీ సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన చేసే వరకు కనీసం కేంద్ర మంత్రులకు కూడా తెలియకుండా చూశారు మోడీ. పెద్ద నోట్ల రద్దుకు ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. ఇది చదవండి..

నవంబర్ 8- మంగళవారం మధ్యాహ్నం కాసేపట్లో క్యాబినెట్ మీటింగ్ ఉంది.. కేంద్ర మంత్రులందరూ మీటింగ్‌కి రావాలని మంత్రులకు సమాచారం వెల్లింది. మీటింగ్‌కి మొబైల్స్‌ తీసుకురావద్దన్న సమాచారం మంత్రుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఎందుకోసం ఈ సమావేశం? అని ఆరా తీసిన వారికి జపాన్ పర్యటనకు మోదీ బయలుదేరనున్న సందర్భంగా ఆ దేశంతో చేసుకోవాల్సిన ఒప్పందాలపై చర్చించేందుకన్న సమాధానం వచ్చింది. అయితే క్యాబినెట్‌ మీటింగ్ ఎజెండాలో మొదటి ఐటెంగా పెద్ద నోట్ల రద్దు ఉంది. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రకటించారు. అందుకు అవసరమైన క్యాబినెట్ అనుమతి కోసమే అందరినీ పిలిచినట్టు చెప్పి వారిపై బాంబేశారు.

రాత్రి 8 గంటల ప్రాంతంలో మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని మంత్రులందరూ క్యాబినేట్‌ భేటి అయినా రూమ్ నుండి వీక్షించారు. మోడీ ప్రసంగం పూర్తి అయ్యేంత వరకు ఎవరినీ బయటకు కదలనీయలేదు. మోడీ ప్రసంగం ముగిసిన తరువాతనే కేంద్ర మంత్రులను బయటకు పంపారు. మంత్రులతో పాటు సమావేశానికి హాజరైన ఆర్బీఐ అధికారులనూ ఇదే విధంగా క్లోజ్డ్ డోర్ అరెస్ట్ చేశారు. పాత నోట్ల రద్దుపై ఏ విధమైన లీకులూ బయటకు వెళ్లకుండా చూసేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మూడు గంటల పాటు కేంద్ర మంత్రులు తమ సెల్ ఫోన్లను వదిలి, ఓ గదిలో కూర్చోవాల్సి వచ్చింది. రాత్రి 6:45 నుంచి 9 గంటల వరకూ వీరంతా గదిలోనే ఉండిపోయారు.

పెద్ద నోట్ల ప్రకటనకు ముందు మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. దాంతో, అందరూ మరోసారి సర్జికల్‌ సై్ట్రక్స్‌ చేస్తారనో, మరొకటో అంచనా వేశారు. కానీ, పెద్ద నోట్ల రద్దు తర్వాత శాంతి భద్రతల సమస్య తలెత్తితే దానిని నివారించడానికే వారితో సమావేశమయ్యారని సమాచారం.

ఆ టైమ్‌లోనే మోడీ ఎందుకు ప్రకటన చేశారు..
ఇందుకు ప్రధాన కారణం.. చివరి నిమిషంలో, రాత్రికిరాత్రి కోట్లాది రూపాయలు చేతులు మారకుండా ఉండడమేనని సమాచారం. పెద్ద నోట్లను రద్దు చేశారని తెలిసిన వెంటనే బడా బాబులు తమకు తెలిసిన బ్యాంకు మేనేజర్లను ఆశ్రయిస్తారు. రాత్రికి రాత్రే మేనేజర్ల సహకారంతో పెద్ద నోట్లను బ్యాంకులకు బదిలీ చేసి, వంద, యాభై నోట్లను మార్చేసుకుంటారు. దేశవ్యాప్తంగా ఇలా కొన్ని వందల కోట్ల రూపాయల నల్ల డబ్బు తెల్ల డబ్బుగా మారే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే, నల్ల ధనంపై ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోవడమే కాదు.. దీనిని నివారించడానికే మోదీ రాత్రి 8 గంటలు దాటాక ప్రకటన చేశారని బ్యాంకింగు వర్గాలు వివరిస్తున్నాయి.

మోడీ ప్రకటన చేయడానికి ముందు బంగారం షాపులు మూతపడే సమయాన్ని దృష్టిలో ఉంచుకున్నారు. అంతేకాదు.. ఆ ప్రకటన ప్రభావం వెంట నే షేర్‌ మార్కెట్‌పై పడకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో, సట్టా బజార్‌నూ చావుదెబ్బ తీశారు. అమెరికా ఎన్నికలపై కొన్ని వేల కోట్ల బెట్టింగ్‌లు జరిగాయి. వాటి ఫలితాలు రాత్రి ఒంటిగంట నుంచి రావడం ప్రారంభమయ్యాయి. కానీ, అర్ధరాత్రి 12 గంటల నుంచే కరెన్సీకి విలువ లేకుండా చేసేశారు.

- Advertisement -