పోస్ట్ ప్రొడ‌క్ష‌న్లో ‘బైలంపుడి’..

232
Bailampudi Movie
- Advertisement -

తార క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రంహనందరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘బైలంపుడి’.హరీష్‌ వినయ్‌, త‌నిష్క తివారి జంటగా నటిస్తోన్న ఈ చిత్రం ద్వారా అనిల్ పి.జి. రాజ్‌ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ నెలాఖ‌రులో ఆడియో విడుద‌ల మేలో సినిమాను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత బ్రంహనందరెడ్డి మాట్లాడుతూ…‘‘పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమా మీద ఆసిక్తతో తొలిసారిగా నిర్మాతగా ‘బైలంపుడి’చిత్రాన్ని నిర్మిస్తున్నా. అంద‌రూ కొత్త‌వారైన‌ప్ప‌టికీ ఎంతో స‌హ‌జ‌సిద్ధంగా న‌టించారు. షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో సినిమాని తెర‌కెక్కించాము. `ఇక్క‌డ యుద్ధం చేయాలి…గెల‌వ‌డానికి కాదు, బ‌త‌కాడానికిఅనేది మా సినిమా క్యాప్ష‌న్. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ ఎండింగ్‌లో ఆడియో విడుద‌ల చేసి మేలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.

ద‌ర్శ‌కుడు అనిల్ పిజి రాజ్ మాట్లాడుతూ…`బైలంపుడి` అనే గ్రామంలో జ‌రిగే ల‌వ్ అండ్ పొలిటిక‌ల్ చిత్ర‌మిది. ప్ర‌తి పాత్ర ఎంతో స‌హ‌జ సిద్ధంగా ఉంటుంది. ఒక విలేజ్ లో ఏమైతే అంశాలు ఉంటాయో...మా సినిమాలో కూడా అన్ని అంశాలుంటాయి. నిర్మాత ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. ప్ర‌స్తుతం కొత్త క‌థ‌ల‌ను ఆదరిస్తున్నారు. ఆ త‌ర‌హాలో వ‌చ్చే మా సినిమాను కూడా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.

హరీష్‌ వినయ్‌, తనిష్క తివారి, బ్రంహనందరెడ్డి, సుచిత్ర, గణి, గోవింద్‌, నటరాజ్‌, న‌రి, నాగార్జున‌, సెబాస్టియన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, డైలాగ్స్‌: సాయి, ఎడిటర్‌: జానకిరామ్‌, ఫైట్స్‌: కృష్ణం రాజ్‌, ఆర్ట్‌: ఉత్తమ్‌కుమార్‌, డాన్స్‌: ఘోరా, లిరిక్స్‌: రామారావు, పిఆర్వో: వంగాల‌ కుమారస్వామి, నిర్మాత: బ్రంహనందరెడ్డి, సినిమాటోగ్రాఫ‌ర్‌-స్టోరి-స్క్రీన్‌ప్లే-డైరక్షన్‌: బ్రంహనందరెడ్డి, సినిమాటోగ్రాఫ‌ర్‌-స్టోరి-స్క్రీన్‌ప్లే-డైరక్షన్‌: అనిల్ .పిజి .రాజ్‌

- Advertisement -