కరెంట్ బిల్లులు కూడా కట్టలేకపోతున్నాంః నిర్మాత సురేశ్ బాబు

209
Suresh babu

అమెజాన్, నెట్ ఫ్లిక్స్ పై నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయిందని, ఏవో కొన్ని పెద్ద సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు థియేటర్ల వరకు వస్తున్నారని సురేశ్ బాబు పేర్కొన్నారు. కాగా సినిమా విడుదలైన కొద్ది రోజులకే అమెజాన్, నెట్ ప్లిక్స్ లలో సినిమా వస్తుండటంతో థియేటర్లలోకి వచ్చి సినిమా చూసే వారి సంఖ్య తగ్గింపోయిందన్నారు. దీని వల్ల చిన్న సినిమా నిర్మాతలు, డిస్ట్రీబ్యూటర్లకు చాలా నష్టం జరుగుతుందని చెప్పారు. తాను నిర్వహిస్తున్న థియేటర్స్‌కు కనీసం కరెంట్ బిల్ కూడా కట్టలేని స్టేజ్‌లో ఉండటం తనకే ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పాడు .

ఇప్పటికే తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ రూపంలో స‌రికొత్త విప్ల‌వం మొద‌లైంది. ఒక‌ప్పుడు విడుద‌లైన త‌ర్వాత రెండు మూడు నెల‌ల‌కు కానీ ఒరిజిన‌ల్ ప్రింట్స్ వ‌చ్చేవి కావు. ఇక ఆ సినిమాను టీవీల్లో ప్లే కావాలంటే కూడా చాలా స‌మ‌యం ప‌ట్టేది. కానీ ఇప్పుడు డిజిట‌ల్ రైట్స్ పుణ్య‌మా అని సినిమా విడుద‌లైన త‌ర్వాత కేవ‌లం నెల రోజుల్లోనే ప్రింట్స్ వ‌చ్చేస్తున్నాయి. దాంతో సినిమాల‌కు వెళ్ల‌డం కూడా పూర్తిగా మానేస్తున్నారు ప్రేక్ష‌కులు. ఎలాగూ నెల రోజుల్లో ఒరిజినల్ ప్రింట్ ఇంట్లోనే చూడోచ్చు కదా సినిమాలు చూడటం మానేస్తున్నారు ప్రేక్షకులు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో థియేటర్స్ అన్నీ కళ్యాణ మంటపాలుగా మారడం ఖాయం అంటున్నాడు నిర్మాత సురేశ్ బాబు.