టీడీపీ సినియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈసందర్భంగా ఇవాళ మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి కలిశారు ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లిన కేసీఆర్ టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారు.
తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్రానికి మీలాంటి అనుభవజ్ఞుల అవసరం ఉందన్నారు. దీంతో కేసీఆర్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మండవ వెంకటేశ్వరరావు.. ఈ విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానన్నారు. రేపు లేదా ఎల్లుండి మండవ వెంకటేశ్వర్ రావు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తుంది. మండవ వెంకటేశ్వరరావు నిజామాబాద్ జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు.
ఆయన ఇప్పటి వరకూ ఐదు సార్లు శాసనసభకు ఎన్నికకాగా, ఒక సారి మంత్రిగా పనిచేశారు. కొద్ది రోజులుగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఏకంగా సీఎం కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్లి మరి పార్టీలోకి ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.