పీక కోస్తా.. మళ్లీ బుక్కైన బుల్‌ బుల్‌ బాలయ్య

389
Balakrishna
- Advertisement -

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నోటి దురుసు, జనాలపై చేయి చేసుకోవడం చూస్తునే ఉన్నాం. గతంలో ఓ మీడియా వ్యక్తిపై కూడా నోరుపారెసుకున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. బాలయ్య హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ తన భార్య వసుంధరతో కలిసి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో బాలయ్య సొంత పార్టీ కార్యకర్తలపై మళ్లీ రెచ్చిపోయారు. చుట్టూ వందలాది మంది కార్యకర్తలు చూస్తుండగానే హంగామా చేశారు. హిందూపురంలో గెలువడమే కష్టంగా ఉందంటే.. వేలు, లక్షలు మెజారిటీ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు.. అరే నీ పేరు, అడ్రస్ చెప్పరా.. గెలువకపోతే నీ సంగతి చెప్తా.. పీక కోస్తా.. నా కొడుకా.. ఏసిపడదొబ్బుతా.. అంటూ బాలయ్య సొంతపార్టీ కార్యకర్తలపై నోరు పారేసుకున్నారు. ప్రస్తుతం బాలయ్య బెదిరింపుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -