గత ఎన్నికల ముందు జనసేన పార్టీని స్ధాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు , బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలోకి దిగారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేస్తున్నారు.
నరసాపురం నుంచి పార్లమెంట్ అభ్యర్ధిగా ఆయన బరిలోకి దిగారు. ఇప్పటికే విసృతంగా ప్రచారం చేస్తున్న నాగబాబు ఆయనకు తొడుగా కూతురు నిహారిక ప్రచారం చేస్తుంది. ఇక మరో ఇద్దరూ హీరోలు జనసేన తరపున ప్రచారం చేయనున్నట్లు తెలిపారు నాగబాబు భార్య పద్మజ. నాగబాబు తరపున ప్రచారం చేయడానికి వరుణ్ తేజ్ , అల్లు అర్జున్ ఇద్దరూ రానున్నట్లు తెలిపారు.
ఇక చిరంజీవి జనసేన తరపున ప్రచారానికి రారంటూ స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. రాజకీయాల పరంగా తమ ఇద్దరి ఆలోచన వేరే ఉంటుందని చెప్పారు. ఇక నాగబాబు కోసం మెగా ఫ్యామిలీ మొత్తం ప్రచారం చేయనుండగా ఆయన ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాలి మరి.