ఐపిఎల్ లో వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన సన్ రైజర్స్ హైదరబాద్ పాయింట్ల పట్టికలో మొదటి స్ధానంలో ఉంది. నిన్న రాత్రి ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడా విజయం సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్. హైదరాబాద్‌కు ఇది వరుసగా మూడో విజయం కాగా, ఢిల్లీకి ఇది వరుసగా రెండో ఓటమి.టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకుంది సన్ రైజర్స్. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేసింది.
14పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పొయింది ఢిల్లీ. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఓపెనర్ పృథ్వీషా (11) బౌల్డయ్యాడు. ఆ తర్వాత కూడా అందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాట్స్ మెన్లు విలవిలలాడిపోయారు. ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే అత్యధిక పరుగులు చశాడు 41బంతుల్లో 43పరుగులు చేశాడు. ఆ తర్వాత చివర్లో అక్షర్ పటేల్ 13బంతుల్లో 23పరుగులు చేశాడు.
నిర్ణిత 20ఓవర్లలో కేవలం 129పరుగులు మాత్రమే చేసిన ఢిల్లీ సన్ రైజర్స్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఇక 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి హ్యాట్రిక్ కొట్టింది. సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్లు వార్నర్ 10, బెయిర్‌స్టో 48, శంకర్ 16, మనీష్ పాండే 10, దీపక్ హుడా 10, యూసుఫ్ పఠాన్ 9, నబి 17 పరుగులు చేశారు.