తెలంగాణ పర్యటనలో భాగంగా మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయకు క్షమాపణలు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఎల్బీస్టేడియంలో జరిగిన విజయ్ సంకల్ప్ సభలో మాట్లాడిన అనంతరం బండారు దత్తాత్రేయతో మోడీ కాసేపు ముచ్చటించారు.
ఏటా హోలీ తర్వాత మీ జుట్టు రెండు మూడు నెలల పాటు ఎర్రగా ఉండేది. ఈసారి తెల్లగా ఉందేం? అని దత్తన్నను ప్రశ్నించారు మోడీ. దానికి దత్తాత్రేయ స్పందిస్తూ.. కొద్ది నెలల క్రితం మా అబ్బాయి చనిపోయాడు. అందుకే హోలీ వేడుకల్లో పాల్గొనలేదు అని చెప్పారు. దీంతో స్పందించిన మోడీ నాకు ఆ విషయం గుర్తులేదు క్షమించండి అని దత్తాత్రేయతో అన్నారు
ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న దత్తాత్రేయ ఏకైక కుమారుడు వైష్ణవ్‌కు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కొడుకు మృతితో కుంగిపోయిన దత్తాత్రేయ రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. ఇక ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ సీటును ఆ పార్టీ నేత కిషన్ రెడ్డికి కేటాయించింది బీజేపీ.