కాలినడకన తిరుమలకు సమంత..

343
Actress Samantha
- Advertisement -

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని ప్రముఖ కథానాయిక సమంత దర్శించుకున్నారు. అలిపిరి నుండి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు సమంత. దారి పొడవున ఫ్యాన్స్‌ను పలకరిస్తూ ముందుకుసాగారు. సామ్‌తో కలిసి సెల్ఫీ తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సమంతకు ఆలయ అర్చకులు వేదశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, సమంతను పట్టువస్త్రంతో సత్కరించారు. తిరుమల అంటే చాలా ఇష్టమైన ప్రదేశం అని ఈ సంద‌ర్భంగా సమంత అన్నారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సమంతతో కలిసి పోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.

పెళ్లి తర్వాత నాగచైతన్యతో కలిసి సమంత నటించిన చిత్రం మజిలి. ఈ నెల 5న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -