16 ఎంపీ సీట్లు గెలిపిస్తే భారతదేశ గమనాన్నే మారుస్తాః సీఎం కేసీఆర్

606
KCR
- Advertisement -

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 16మంది టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్దులను గెలిపిస్తే భారతదేశ గమనాన్నే మారుస్తామని హామి ఇచ్చారు సీఎం కేసీఆర్. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో సీఎం పాల్గోన్నారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గతంలో పాలమూరు ఎంపిగా ఉండి తెలంగాణ సాధించానని, 16 ఎంపి సీట్లు గెలిపిస్తే భారతదేశ గమనాన్నే మారుస్తానిని తెలిపారు. మన వెనుక అనేక రాష్ట్రాల వాళ్లు ఉన్నారని, ఎన్నికల తెల్లారి ఎవరి జాతకాలు ఏంటో తేలుతాయన్నారు.

ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల నాయకత్వమే రాబోతోందని, అందులో టిఆర్‌ఎస్ ఎంపిలు కీలకం కాబోతున్నారని కెసిఆర్ తెలియజేశారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.30 వేల కోట్లు కావాలని, కేంద్రం మెడలు వంచి తెచ్చుకుందామన్నారు. తెలంగాణ రాకముందు పాలమూరు ఎట్లుండే..తెలంగాణ వచ్చాక పాలమూరు ఎట్లుందని ప్రజలను అడిగారు. ఇపుడు కరెంట్ ఎలా ఉంది. అప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉండే, ఇపుడు రైతు బంధుతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపినం.

లక్షల సంఖ్యలో యాదవులకు గొర్రెలు పంపిణీ చేసినమని సీఎం అన్నారు. ఇటివలే జరిగిన ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో 14 స్థానాలకు 13 అసెంబ్లీ స్థానాలు గెలిపించారు. అద్భుతమైన విజయాన్ని అందించిన పాత మహబూబ్‌నగర్ బిడ్డలలందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని నాశనం చేశాయన్నారు. గతంలో ఇచ్చిన 200 పెన్షన్‌ను 1000 కి పెంచి ఇచ్చినం. ఇపుడు దాన్ని కూడా పెంచి 2వేలు పెన్షన్ ఇస్తున్నం. వచ్చే నెల నుంచి 2 వేల పెన్షన్ అందిస్తామని చెప్పారు. నాగర్ కర్నూల్ టీఆర్ఎస్ అభ్యర్ధి రాములును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

- Advertisement -