ప్రేమమ్ సినిమాతో తెలుగు, తమిళ, మాలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. తెలుగులో ప్రేమమ్, ఫిదా సినిమాతో స్టార్ హిరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయింది ఈ మల్లు బ్యూటీ. ఈసినిమా తర్వాత తెలుగులో శర్వానంద్ సరసన పడిపడి లేచేమనసు సినిమా నటించింది. ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో అమ్మడుకు అవకాశాలు రావడం లేదు.
ఈ మధ్య కోలీవుడ్‌లో సాయి పల్లవిపై ప్రేమ,పెళ్ళి అంటు రూమర్స్ చాలానే వస్తున్నాయి. అయితే తాజాగా ఈ అమ్మడు ఒక దర్శకుడితో ప్రేమలో పడిందనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. తమిళ దర్శకుడు విజయ్ తో సాయి పల్లవి ప్రేమలో ఉందనే టాక్ కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో ఈ దర్శకుడితో సాయిపల్లవి ‘కణం’ సినిమా చేసింది.
ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తాజాగా ఈపుకార్లపై స్పందించారు దర్శకుడు విజయ్. నేను సాయి పల్లవి ప్రేమించుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అవన్నీ పుకార్లన్నారు. కొంతమంది కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇదంతా పనిలేనివాళ్లు చేస్తున్న ప్రచారం మాత్రమే అని స్పష్టం చేశాడు.